ముస్తాబాద్, అక్టోబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రక్తదానం చేయగా వారితో పాటు పలువురు జిల్లా పోలీస్ లు కోవలో నడిచారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ ఎస్సై గణేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందితోపాటు రక్తందానం చేసిన జర్నలిస్టు వెంకటరెడ్డిని అభినందించారు.
