మంచిర్యాల జిల్లా నూతన కలెక్టర్ గా కుమార్ దీపక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ ఐఏఎస్ గా కుమార్ దీపక్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అదన కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రస్తుత మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది.
