దౌల్తాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా లకు పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు తో కలిసి పంటలను సందర్శించి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలు, అధిక తేమ వాతావరణం వలన పత్తి పంటపై తెగులు సోకే అవకాశం ఉన్నందున కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటర్ నీటిలో మూడు గ్రాములు కలిపి పిచికారి చేసుకోవాలని అన్నారు.
వర్షాలు తగ్గిన తర్వాత ఎకరానికి 30 కిలోల యూరియా లేదా 10 కిలోల పొటాష్ ఎరువు వేసుకోవాలన్నారు.
నీరు ఎక్కువ వుండి ఎరువులు వేయలేని పరిస్తితుల్లో NPK 19:19:19 లేదా 13:0:45 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి పత్తి పై పిచికారి చేసుకోవాలని అన్నారు.
ముఖ్యంగా వరి లో కలుపు నివారణకు వరి నాటిన 3 రోజుల్లో ప్రిటిలాక్లోర్ 500 ఎంఎల్ ను 10 కిలోల ఇసుకలో కలిపి చల్లు కోవాలన్నారు. చల్లుకునేటప్పుడు పొలంలో నీరు అధికంగా ఉంచవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మాధవి, రైతులు పాల్గొన్నారు.




