*చిన్నారి సహస్రను మట్టుబెట్టిన మానవ మృగాన్ని ఉరితీయాలి – సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*
కాగజ్ నగర్ : తెలియజేశార పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఈరోజు దహెగాం మండలానికి చెందిన చిన్నారి సహస్ర దారుణ హత్యాచార సంఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సమాజంలో ఇటువంటి మానవ మృగాలకు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆ నిందితున్ని ఉరితీయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేశారు.
అలాగే ప్రభుత్వం సహస్ర కుటుంబ సభ్యులను ఆదుకోవాలని అన్నారు.





