చికిత్స పొందుతూ గర్భిణీ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 28
సిరిసిల్ల: చికిత్స పొందుతూ గర్భిణీ మృతి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన సిద్రవేని సోని అనే గర్భిణి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆమె హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్‌లో చేరింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
