ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం
యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 12
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం కాచరం ( కైలాస పురం) లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి దంపతులను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ గుప్త, యువజన అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య స్వామి ప్రజలను భక్తి మార్గం వైపు మల్లె విధంగా కృషి చేస్తూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభిందనీయం అని, ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని అంజయ్య స్వామి రాష్ట్ర వ్యాప్తంగా ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు
