ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి23, గతతొమ్మిది నెలల క్రింద ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబ సభ్యులకి 2,00,000/- రూపాయల చెక్కు అందజేత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కు 2,00,000/- రూపాయల చెక్కును నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి అందజేసిన మండల బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందారు.
కస్తూరి రవి భార్య అయిన రమ గారికి బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటూ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన 2,00,000/- రెండు లక్షల రూపాయల చెక్కును నేరుగా ఇంటికి వెళ్లి వారికుటుంబ సభ్యులకు అందజేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, బి.ఆర్.యస్. మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉపసర్పంచ్ శాడ శ్రీనివాస్, ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, గ్రామశాఖ అధ్యక్షుడు పొట్లపల్లి కిషన్, బి.ఆర్.ఎస్ నాయకులు కొమ్ము బాలయ్య, కోల పర్శరాములు, వెంకటరమణ, దేవయ్య, విష్ణు, తిరుపతి, అంజయ్య, దేవదాస్, శోభన్, సురేందర్, నవీన్, బి.ఆర్.ఎస్.వి నాయకులు కోలఅక్షయ్ గౌడ్, బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
115 Viewsఈ రోజు మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాటశాలలో ఎస్ ఎస్ సి చదువు తున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీ సుతారి బాలరాజు గారు మరియు ఉపసర్పంచ్ శ్రీ చెన్నాల దేవరెడ్డి గారు సంయుక్తంగా కలసి గోరుముద్ద కార్యక్రమంను ప్రారంబిస్తూ పిల్లలకు స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ గారు వీద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం అయ్యేంతవరకు గోరుముద్ద కార్యక్రమం కు కావాలసిన నిధులు సమకూరుస్థామన్నారు.ఈ […]
65 Viewsశ్రావణంలోని వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పొడిని ఉపయోగించి లక్ష్మీదేవి అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపి తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. మహిళలందరు కూడ వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొని లక్ష్మీదేవి […]
149 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]