ప్రాంతీయం

పాఠశాల పున: ప్రారంభం

61 Views

వేసవి సెలవుల అనంతరం పాఠశాల పున: ప్రారంభం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జూన్ 12

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదిపుర్ గ్రామంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాల పున: ప్రారంభ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో పునః ప్రారంభం మొదటి రోజున పురస్కరించుకుని అహ్మదిపుర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుగుణాకర్ . ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను యూనిఫామ్, నోటు పుస్తకాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు సుగుణాకర్ మాట్లాడుతూ .

10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినా విద్యార్థి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారములు మరియు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తు జూన్ 12 బుధవారం రోజున తెలంగాణ ప్రభుత్వం అందించిన పాఠ్య పుస్తకాలను, పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పాఠశాల ప్రారంభించిన రోజు సకాలంలో అందించారని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్నిట్లో రాణిస్తారని, అన్ని వసతులు ప్రభుత్వ బళ్ళో వుంటాయని అన్నారు.

అమ్మా ఆదర్శ పాఠశాల నిధులతో మౌలిక సౌకర్యాలు మెరుగ్గు పడుతున్న వసతులు ఇవన్నీటి గురించి విద్యార్థులకు తెలియజేయటం జరుగుతుంది అలాగే గత వారం రోజుల నుండి బడి బాట కార్యక్రమంలో వివిధ గ్రామాలలో తిరుగుతూ మా పాఠశాల ఉపాధ్యాయులు సందర్శించి మా యొక్క పాఠశాల ఫలితాలను తెలియపరుస్తూ వివరించడం జరిగినది అలాగే విద్యార్థులకు ఉచితంగా 2 జతల దుస్తువులు,మధ్యాహ్నా భోజనము,ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను ప్రభుత్వం అందిస్తుందని ఈ సౌకర్యాలను తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లలను బడికి పంపాలని తెలిపినారు.

విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి ఆసక్తి చూపించారు గత సంవత్సరం మా పాఠశాలలో సాధించినటువంటి ఫలితాలలో పదవ తరగతి విద్యార్థులు 54 మంది విద్యార్థులు ఫలితాలలో 100% సాధించడం జరిగినది అందులో భాగంగానే గజ్వేల్ మండలంనే గత సంవత్సరంలో ఏకైక పాఠశాల అహ్మదిపూర్ విద్యార్థిని హాసిని పదవ తరగతి ఫలితాల్లో 10/10 ..10.0 సి జి పి ఏ.సాధించినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్