జూన్ 12, 24/7 తెలుగు న్యూస్:జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.
ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి.
ఈ కమిటీ సమావేశంలో దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులకు జూన్ – 14 నుండి జూన్ – 30వ తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది.
ఈ సమావేశంలో వెబ్ సైటు ద్వారా దరఖాస్తులను లోకల్ స్టేటస్ – ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త లకు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
మల్టిపుల్ అప్లికేషన్స్ల కు దరఖాస్తులకు అవకాశం కల్పించడం జరిగింది .
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటివరకు 12 వేల 11 దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను రీ – వెరిఫికేషన్ కు అవకాశం కల్పించడం జరిగింది.