కార్పొరేట్ పేరుతో విద్యా దోపిడీ అరికట్టాలి.
టి బి ఎస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్.
మంచిర్యాల జిల్లాలో కార్పొరేట్ విద్యా పేరుతో పుట్టగొడుగుల్లా పుట్టుక వచ్చినటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయని తెలంగాణ బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ విమర్శించారు.
కార్పొరేట్ పాఠశాలలో ఐఐటి, ఈ టెక్నో, సీబీఎస్ఈ, ఎక్స్లెంట్ స్కూల్,ఎస్ఆర్ డీజే , ఇంటర్నేషనల్ , మోడల్ అని పాఠశాలలో తదితర రకరకాల తోక పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులకు వలవేసి అందిన కాడికి దండుకుంటున్నారని అన్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధన ప్రకారం నోటీస్ బోర్డు ఏర్పాటు చేయకుండా విద్యాను వ్యాపారం చేస్తున్నారని తెలిపారు.
ప్రతి సంవత్సరం ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ, పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయకుండా, వారితో ఎలాంటి సూచనలు సలహాలు తీసుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో ప్రైవేట్ పాఠశాలలు నడుపుతున్నారని ఆరోపించారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్కేజీ యూకేజీ ల పుస్తకాలు సుమారు 4000 నుండి 5000 వరకు రూపాయలు తీసుకుంటున్నారని అన్నారు. ధనార్జన గా నడిచే ప్రైవేట్ పాఠశాలలపై జిల్లా విద్యాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో కార్పొరేట్ పాఠశాలల ముందు పలు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.





