136 Views
ఎల్లారెడ్డి పేట మండలం
సమస్యలపై రైతులకు వ్యవసాయ విద్యార్థులు అవగాహన కల్పించారు.శుక్రవారం మండల కేంద్రము లోని రైతు వేదిక లో (డి ఎ ఎ టి టి సి) కరీంనగర్ ఆధ్యర్యంలో ప్రాఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కలశాల, జగిత్యాల విద్యార్థులు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక తులనంలో భాగంగా సామాజిక వనరుల పటం,పంట నిష్పత్తి, నేల రకాలు, కదలిక పటం, సమస్యలు ,కలనుగున పటం, వ్యవసాయ కాలచక్రం తదితర వాటి వివరాలతో నేల పై ప్రదర్శించారు.కార్యక్రమం లో (డి ఎ ఎ టి టి సి) కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజేద్రప్రసాద్ , ఎల్లారెడ్డిపెట ఎ ఈ ఓ శ్రీశైలం, రైతులు , మహిళ రైతులు పాల్గొన్నారు. బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గంట బాలా గౌడ్, బందారపు బాల్ రెడ్డి, రైతులు, వ్యవసాయ విద్యార్థులు, అఖిల,చిన్మయి,శ్రీ కావ్య సాయి శ్రీ తదితరులు ఉన్నారు.