సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా వినూతనగా సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోడిగుడ్డు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశభక్తిని చాటుకున్నాడు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 23వేల నానాలతో 11అడుగుల సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని చిత్రించారు. ఈ సంవత్సరం అతి చిన్న సైజులో కోడిగుడ్డు మీద చిత్రించానని తెలిపారు.సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడు. జననం ఉండి మరణం లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న మహనీయుడు,అస్తమించని సూర్యుడు, జయంతి తప్ప వర్ధంతి లేని వీరుడు అన్నాడు.




