(తిమ్మాపూర్ మే 31)
ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది..
వివరాలకు వెళ్తే టోల్ ప్లాజా తప్పించుకుని వెళ్లే మార్గంలో గొల్లపల్లి నుంచి గుండ్లపల్లి వెళ్తున్న క్రమంలో గ్రామంలో లారీ అద్భుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొట్టడంతో స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పింది..
ఒక్కసారిగా గ్రామంలో షార్ట్ సర్కుటుతో టీవీలు, ప్రిడ్జిలు కాలిపోవడం తో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు..
గ్రామస్తులు రోడ్డు పైకి వచ్చి చూడటంతో కరెంట్ పోలు విరిగిఉంది ఈ ప్రమాదానికి కారణమైన లారిని గ్రామస్తులు అడ్డుకున్నారు. డ్రైవర్ అప్రమత్తమై పరారయ్యారు..
లారీ డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు…
టోల్గేట్ నిర్వాహకుల ఇలాంటి ఘటనలు జరుగుతున్న పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
రోజుకు రాత్రి పూట గ్రామం నుండి 100 లారీలు టోల్గేట్ తప్పించుకుని గ్రామాల నుండి వెళ్తున్న టోల్గేట్ నిర్వాహకులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు
డిమాండ్ చేస్తున్నారు..