ప్రాంతీయం

సబ్బు బిళ్ళపై ఎన్టీఆర్ చిత్రం

85 Views

ఏన్టీఆర్ చిత్రాన్ని సబ్బుబిళ్ల మీద చిత్రించి

ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మే 28

సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం  మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని సబ్బుబిళ్ల మీద ఎన్టీఆర్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కలారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ మనదేశ నిజమైన హిందూధర్మ కర్త మూలవిరాట్ విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు  అన్నారు. తెలుగు ప్రజల హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచి, “అన్న  అనే పదానికి శాశ్వత చిరునామాగా మారిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ  నందమూరి తారక రామ రావు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్