–తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు.
(తిమ్మాపూర్ మే 20)
అకాల వర్షాల తాకిడితో నష్టపోయిన రైతుల సమస్యలతో పాటుగా పలు నష్టాల విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భాధితులకు న్యాయం చేయాలని తిమ్మాపూర్ బీజేపీ నాయకులు తిమ్మాపూర్ తహాసీల్దార్ కోడెం కనకయ్య కు వినతిపత్రం అందజేశారు..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసే కార్యక్రమాలలో భాగంగా సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి నాయకులతో తహసీల్దార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, మండలంలోని పలు గ్రామాల్లో ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి బోనస్ 500 లు ఇస్తామన్నటువంటి హామీ ఏదని ప్రశ్నించారు.తరుగు, తాలు తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
గతంలో వచ్చిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు 10 వేల చొప్పున ఇస్తామన్నటువంటి పరిహారం ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు.ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.భాధితులకు అండగా ఉండే విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు.
జిల్లా ఈసీ మెంబర్ చింతం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,మామిడి రాజు,వేల్పుల అనిల్,రామిడి మహేందర్ రెడ్డి,పసుపుల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు..