నవంబర్ 15 హైదరాబాద్
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
2023 శాసన సభ సాధారణ ఎన్నికల సందర్భంలో, ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిర్వహించిన *”మీట్ ది ప్రెస్”* కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మోడరేటర్ గా వహించగా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ స్వాగతం పలికారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, ఎం.ఏ.మాజీద్, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, బి.కిరణ్, డి.స్వామి, హెచ్.యు.జె కార్యదర్శి హమీద్ షౌకత్ లతో ఆయా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల పాత్రికేయులు హాజరయ్యారు.
