దౌల్తాబాద్: యువతకు దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అండగా నిలుస్తున్నారని బిజెపి నాయకులు దేవుడి నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నియోజవర్గంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లర్నింగ్ పత్రాలను మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామ యువకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే సహకారంతో డ్రైవింగ్ వచ్చినవారు లైసెన్సులు కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు డ్రైవింగ్ తెలిసినవారు లైసెన్సులు తీసుకోవాలని లక్ష్యంతోనే యువతకు ఉచితంగా లైసెన్సులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామస్తులకు 40 మందికి ఉచిత డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.




