మంచిర్యాల జిల్లా.
బిజెపి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు యోగా దినోత్సవం కార్యక్రమాలు.
నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలన, పర్యావరణ పరిరక్షణ,యోగ దినోత్సవం మరియు ఎమర్జెన్సీ కార్యక్రమాల వర్క్ షాప్ ఈ రోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ముందుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు చెట్లు నాటి అనంతరం సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి యోగ పరిచయం చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ అని గుర్తు చేస్తూ, 11 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు ఎంతో అభివృద్ధి గురించి వివరిస్తూ 45 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలాలలో శక్తి కేంద్రాలు బూతుల స్థాయిలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు దుర్గమ్మ అశోక్, పట్టి వెంకటకృష్ణ, పెద్దపల్లి పురుషోత్తం, కృష్ణమూర్తి, సతీష్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, సుధీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
