వడదెబ్బ తాకిడికి మహిళ మృతి
గజ్వేల్ మే 11
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన కత్తెరపాక లక్ష్మి (50) అనే మహిళ ప్రతిరోజు ఉపాధి హామీ పథకంలో కూలి పనులకు వెళుతుంది. ఇటీవల భారీ ఎండలు రావడంతో ఆమె వడదెబ్బకు గురైంది. దీనికి తోడు తమ బంధువులు మృతి చెందితే ములుగు, గొల్లపల్లి గ్రామాలకు రెండు రోజుల క్రితం అంత్యక్రియలకు వెళ్ళింది. దీంతో వడదెబ్బకు గురైన లక్ష్మి శనివారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందింది. మృతురాలికి కూతురు శ్యామల, కుమారుడు సుధాకర్ ఉన్నారు.
