ప్రజా సేవకుడు వెంకట్ రామ్ రెడ్డి ని గెలిపించుకుందాం ప్రశ్నించే గొంతుకగా పార్లమెంటుకు పంపుదాం
గజ్వేల్ మే 11
మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ప్రశ్నించే గొంతుక గా పార్లమెంటుకు పంపించాలని గ్రామ శాఖ అధ్యక్షుడు గ్యార మల్లేశం, తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్ అన్నారు. మండలంలో చేబర్తి గ్రామంలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ పథకం వద్ద ఉన్న గ్రామ ప్రజలకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేసి ఉన్నత చదువులు చదివిన కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. చదువు విలువ తెలిసినోడు గెలిచిన వెంటనే మెదక్ జిల్లాలో నిరుద్యోగ యువతకు పివిఆర్ ట్రస్ట్ పేరుతో కోచింగ్ సెంటర్లు మరియు పట్టుదలతో చదువుతున్న వారికి ఉచిత విద్య వంటి అవకాశాలు కల్పిస్త అన్నటువంటి నాయకునికి ఈ ఎన్నికల్లో పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గ్యార మల్లేశం, చేబర్తి తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్, తాజా మాజీ ఉపసర్పంచ్ గుర్రాల స్వామి, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బూరి రాములు గౌడ్, జయరాం, తోట బాలకృష్ణ,బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





