మంచిర్యాల జిల్లా, నస్పూర్.
నేడు అంతర్జాతీయ యోగా సందర్భంగా యోగా అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది.
మంచిర్యాల జిల్లాలో నస్పూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 60 మంది ఆశా వర్కర్లతో మరియు ఇతర వ్యక్తులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా యొక్క గొప్పతనాన్ని గురించి వారికి తెలియజేయడం జరిగింది. యోగా వలన శారీరక పెరుగుదల మానసిక ప్రశాంతత మనిషి జీవన శైలి విధానాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అది కేవలం యోగ ద్వారా మాత్రమే మానము యొక్క జీవనశైలి విధానాన్ని మార్చవచ్చును అని తెలియజేయడం జరిగింది. మనిషికి ఏకాగ్రతతో ఏ విధంగా ఉండాలి అలవాట్లు ఏ విధంగా మార్చుకోవచ్చు మనిషి ఏ విధంగా తనకు తాను ధైర్యంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు సమస్యలు రాకుండా రోగాలను ముందుగానే మనం ఎదుర్కొనే విధంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండాలి. అంటే ఒక మనిషి ముందుగా తన ఆలోచనలు తన జీవన శైలిలో తన ఆహార అలవాట్లలో తన తాను మార్చుకుంటూ తన కుటుంబాన్ని ఒక ఉన్నతమైన కుటుంబం గా మార్చుకుంటూ ఉండడానికి తోడ్పడుతుంది చెడు అలవాట్లకు లోను కాకుండా చెడు ఆలోచనలు రాకుండా ఒక మంచి నడవడికతో గౌరవమైన విధానాన్ని ఉన్నతమైన వ్యక్తులుగా ఉన్నతమైన విలువలతో కూడిన విధానం నేర్పుతుంది యోగ అందుకని మన యోగ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకొని ఆరోగ్యంగా ఆనందంగా తన జీవనశైలిని ఒక ఉన్నతంగా మార్చుకోవాలని కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల జూన్ 21 యోగా డే సందర్భంగా ఈ 20 రోజులు ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి యోగ కార్యక్రమాన్ని తెలిసే విధంగా యోగా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈరోజు మేము ఆరోగ్యం మంది ద్వారా యోగ ఇన్స్పెక్టర్గా మా వంతుగా మేము తెలియజేయడం జరిగింది. నస్పూర్ యోగ ఇన్స్పెక్టర్ ఏసుదాకర్ మరియు మేఘన మరియు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నోడల్ ఆఫీసర్ గా డాక్టర్పద్మజ మేడం, ఫార్మసిస్ట్ పుష్పాంజలి, మరియు కిషన్ మరియు ఆశ మేడం ఒక 80 మంది దాకా ఇందులో పాల్గొనడం జరిగింది.
నస్పూర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది, మరియు ముఖ్య అతిథులుగా డిపిఎం రాథోడ్ రవీందర్ కన్వీనర్ గా ఈ ప్రోగ్రాం ఆధ్వర్యంలో జరగడం మాకు సంతోషం తెలపడం జరిగింది.
