పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ బైక్ ర్యాలీ చేసింది .పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బిజెపి పార్టీ ఎర్రబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మంచిర్యాల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుండి శ్రీనివాస టాకీస్ చౌరస్తాలో ముగించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జ్ మురళీధర్ రావు పాల్గొన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
