*బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా*
సిరిసిల్ల జిల్లా:జులై 23
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూసి సేమ్ అలాగే నీటిలో జంపు చేసేందుకు ఉదయ్ (11) అనే బాలుడు యత్నించాడు. ఈ క్రమంలో మెడకు ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
