ప్రాంతీయం

గాడ్ విజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్లు సమావేశం

60 Views

గజ్వేల్ నియోజకవర్గం పాస్టర్స్ సమావేశం ప్రజ్ఞాపూర్ లో నిర్వహించడం జరిగింది. ఇందులో గజ్వేల్, జగదేవపూర్, ములుగు మండలాల పరిధిలోని పాస్టర్లు పాల్గొన్నారు. “గాడ్ విజన్ అసోసియేషన్”అధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో గాడ్ విజన్ గౌరవ అధ్యక్షులు నెలమల్లీ సికిందర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రాంరెడ్డికి మద్దతు తెలుపాలని రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గాడ్ విజన్ అసోసియేషన్ అధ్వర్యంలో నియోజకవర్గం అంతటా సమావేశంలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పాస్టర్లు అందరికీ బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ సమావశంలో పాస్టర్ గాడ్ విజన్ ప్రతినిధి శ్రీ సాగర్, పాస్టర్ అబ్రాహాము, స్థానిక పాస్టర్లు ఇజ్రాయెల్ , క్రిస్తుదాసు, జాన్, మార్కు, సమేల్, శ్రీరాజ్ పాల్, విక్టర్, జయరాజ్, ఫిలిప్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka