రాజకీయం

మంచిర్యాలలో ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్

81 Views

*మంచిర్యాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో*

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మంచిర్యాల జిల్లా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.  కేసీఆర్ మంచిర్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజులలో  ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పలనాన్ని అంతమొందించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.

అదేవిధంగా రైతులకు వేయవలసిన రైతుబంధు ఇంకా వేయలేదని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన దళిత బందును కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నదని తెలిపారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కొరత లేదని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కట్టింగ్ చేస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు . మల్ల టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు చేయాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు, సంక్షేమ పథకాలు, తెలంగాణ అభివృద్ధి,  మరియు  నియాకాలు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను చేస్తామని ఆయన తెలిపారు.

మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంట్  ఎంపీ అభ్యర్థి  టిఆర్ఎస్ పార్టీ తరపు నుండి పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో మంచిర్యాలలో రోడ్  షో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్