Breaking News

మజీద్ పల్లిలో బి ఆర్ఎస్ ఎన్నికల ప్రచారం …..

124 Views

మే 5, 24/7 తెలుగు న్యూస్ : వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఎన్నికల గురించి ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు, బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చేసిన పనుల గురించి వివరించడం జరిగింది. ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గురించి తెలియజేశారు.

మజీద్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, వీరు అధికారంలో ఉన్నప్పుడుచేసినా పనుల గురించి వరుసగా వివరించడం జరిగింది.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని, కాంగ్రెస్ రావడం వల్ల ఆగిపోయాయని, ఓడిపోవడం వల్ల, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయామని తెలియజేస్తూ, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చుతామని మాటిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై, గుర్తుతెలియని దుండగులు దాడికి దిగారని, బిఆర్ఎస్ పార్టీని గెలిపించిన వల్ల వాళ్లకి బుద్ధి చెప్పొచ్చని తెలియజేశారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7