(తిమ్మాపూర్ ఏప్రిల్ 19)
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం కరీంనగర్ పట్టణంలోని కృషి భవన్ లో నిర్వహించారు.ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య హాజరై నూతన జిల్లా కార్యవర్గన్ని ఎన్నుకున్నారు..ఇందులో భాగంగా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన పారునంది జలపతిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు..
ఈ సందర్భంగా జలపతి మాట్లాడుతూ..
జిల్లాలో అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయుటకు నా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు.తన నియామకానికి సహకరించిన జాతీయ కోఆర్డినేటర్ వరుణ్ కుమార్,రాష్ట్ర అధ్యక్షుడు వినయ్ కుమార్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కలువల రామచంద్రం, కాంపల్లి సతీష్,రాష్ట్ర కార్యదర్శి సాంబారి కొమురయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వంతడుపుల సంపత్, జిల్లా అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.