ప్రాంతీయం

ఊరూర రాములోరి కళ్యాణ మహోత్సవం కసుల పండుగ…

176 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 17 (24/7న్యూస్ ప్రతినిధి) మొర్రాయిపల్లె గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సెస్ డైరెక్టర్ సందుపట్ల  అంజిరెడ్డి పద్మ దంపతులు నూతన పట్టు వస్తాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. మండలంలోని ముస్తాబాద్ చికోడు, పోతుగల్, బంధనకల్ మాజీ రెడ్డి సంఘం అధ్యక్షులు చల్లదేవరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నాయకులు ఘనంగా రాంలోరి కళ్యామహోత్సవం అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. మద్దికుట గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవ భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు భాగ్యశ్రీ దంపతులు పట్టువస్త్రాలు అందించి ఘనంగా కళ్యాణ నిర్వహించారు. పలు గ్రామాలలోని అంజన్న వెంకటేశ్వర ఆలయాలలో కళ్యాణ మండపాలు వికసించేలా అలంకరణలుచేసి సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి మారుమోగిన శ్రీరామ గానాలతో కిక్కీరిన భక్తులతో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆడు కొండాపూర్ గ్రామంలో చిగురు వెంకన్న సీతారామచంద్ర స్వాముల విగ్రహాలను వైద్యాలతో పెళ్లి మండపాలు తీసుకెళ్లారు. మొర్రాయిపల్లెలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో ముస్తాబాద్ పల్లె సత్యం గౌడ్ దంపతులు, మాజీ ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ మల్లారపు రమేశ్ రెడ్డి, పార్టీలకు అతీతంగా నాయకులు అల్లము లక్ష్మణ్, అధ్యక్షుడు బద్దీపడిగే లక్ష్మణ్ , పల్లె దేవయ్య, గ్రామ భక్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్