ప్రాంతీయం

మందమర్రి ప్రజా వ్యధ…..

196 Views

మందమర్రి ప్రజా..వ్యధ..(స్పెషల్ రిపోర్ట్:( పట్టణంలో ఇల్లు లేక తాటాకు గుడిసెల్లో బతుకు ఈడుస్తున్న కన్నెత్తి చూసిన నాయకుడు లేడు) (రేషన్ కార్డులు లేవని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఉత్తకతే)( పట్టణ రహదారుల పై బొందలు, వెలుతురు లేని ఫ్లై ఓవర్ బ్రిడ్జి) (పాత బస్టాండ్ ప్రాంతంలోనీ ప్రభుత్వ ఆసుపత్రి లో రాత్రి సమయంలో డ్యూటీ డాక్టర్ ను ఉండడు)(ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో తాగు నీటి సమస్య ,విద్యార్థులు చదవడానికి సరైన కోర్సులు లేవు )(ఉద్యానవనం పనులు మొదలుపెట్టి ,బిల్లులు ఎత్తి పనులు మధ్యలో ఆపిన వైనం )(మందమర్రి మున్సిపాలిటీలో 80 వేల జనాభా ఉన్న, స్మశాన వాటిక లేక ,చావు కూడా సమస్యగా మారిందిక్కడ) ( పట్టణంలోని 24 వార్డులు మొత్తం చెత్త మయం)( చెత్త కుండీలు పెట్టించక దారులపై చెత్త పోస్తున్న వైనం)( మురిగిన చెత్తతో కాలనీలన్నీ కంపుమయం)న్యూస్ మందమర్రి :(మోకనపల్లి బద్రి మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పట్టణంలో గత కొంతకాలంగా అపరిశుభ్రతకు ఆనవాలుగా మారి, దోమలకు ,ఈగలకు, పందులకు ఆవాసంగా మారిన వైనం కనబడుతుంది.మున్సిపాలిటీలోని 24 వార్డులలో వీధి చివర చెత్తకుండీలు పెట్టించక,ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా చెత్త వేస్తూ …ప్రధాన రహదారుల పై కూడా చెత్త పోస్తున్నారంటే, పట్టణ అపరిశుభ్రత అనేది ఏం.. స్థాయికి చేరిందో అవగతం అవుతుంది, .పట్టణ పరిశుభ్రత విభాగానికి చెందిన మున్సిపాలిటీ & సింగరేణి వ్యవస్థ నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప , త్వరితంగా ఈ చెత్తను తీసివేసి, పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆలోచన చేయలేకపోతున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ప్రధాన రహదారిపై.. పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదాలు సంభవించి వాహన చోదకుల కాళ్లు, చేతులు విరుగుతూ.. హాస్పిటల్ పాలవుతు… ఆర్థికంగా ,మానసికంగా శారీరకంగా అవిటి వాళ్లుగా మారుతూ.. కుటుంబ పరంగా దిగజారిపోతున్నారు. ఈ రోడ్లపై పెద్ద ప్రమాదం సంభవించి ప్రాణాలు పోతే తప్ప ,పట్టించుకునే పరిస్థితిలో మున్సిపాలిటీ వ్యవస్థ లేదని చెప్పవచ్చు, అద్దరాత్రి సమయంలో పట్టణ ప్రజలకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే, ప్రథమ చికిత్స అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామంటే కనీసం డ్యూటీ డాక్టర్ కూడా ఉండడు. గత సంవత్సరం భారీ వర్షాలకు దాదాపుగా 250 ఇండ్లు కూలి, అనాధలుగా మారిన అభాగ్యులను ఇప్పటికీ రూపాయి ఆర్థిక సహాయం చేయకపోగా ఇల్లు పోగొట్టుకున్న అభాగ్యులను పలకరించిన వారు లేరు ,ప్రస్తుతం మందమర్రి పాత బస్టాండ్ ఎస్సీ, ఎస్టీ కాలనీ, అదే విధంగా.. పట్టణంలో ఉండడానికి ఇల్లు లేక తాటాకు గుడిసెల్లో,.. చీరలను చుట్టు కట్టుకొని ,గాలికి ఎగిరి పోయే పూరి గుడిసెల్లో నివసిస్తున్న వీరికి , ఇల్లు లేని అభాగ్యుల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూములు ఇవ్వలేదు ,మందమర్రి మండలంలో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 870 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించారు .ఇప్పటికీ ఒక్క గూడు లేని నిరుపేదకు గాని ,ఇల్లు కూలిన వారికి గాని ఇచ్చిన దాఖలాలు లేవు . ఆ ఇండ్లు గబ్బిలాలకు,పాములకు ఆవాసాలుగా మారి మూలుగుతున్నాయి. కనీసం పేదోడు తినడానికి తిండి గింజలు అందించే ,ప్రభుత్వ ఆహార పథకం అందించే పిడిఎఫ్ బియ్యం కొరకై, ఇచ్చే రేషన్ కార్డుల విషయంలో జాప్యం చేస్తూ ..పేదవాడికి బుక్కెడు కూడు నోటి కాడికి అందని పరిస్థితి .ప్రధాన రహదారులపై రాత్రి అయితే వెలుగు లేక, కటిక చీకటి లో ..పట్టణ ప్రజలు ప్రమాదంలో ప్రయాణం చేస్తున్నారు .ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో..తాగడానికి సరైన నీటి వసతి లేవు. తాగునీటి కోసం విద్యార్థులు చాలా రోజులుగా తల్లడిల్లుతున్నారు. చుట్టూ ప్రహరీ గోడ లేక అసంఘటిత కార్యకలాపాలకు ఆనవాలుగా మారింది ఆ ప్రాంతం. ఆ విద్యార్థుల గోస తీర్చాలంటున్నారు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు విద్యార్థులు. ఆ.. కాలేజీలో విద్యార్థులు చదువుకోవడానికి సరైన కోర్సులు ( ట్రేడ్లు) లేవు .అంత పెద్ద భవనాన్ని నాలుగు కోర్సులకే పరిమితం చేశారు .ప్రస్తుతం మందమర్రి పట్టణంలో తాగునీటి నీటి సమస్య తాండవిస్తుంది .కావున కార్మిక, కర్షక కాలనీలకు సరైన మంచి నీరు అందించాలని మందమర్రి మున్సిపాలిటీ ,పట్టణంలో చాలా రోజులుగా నిర్మితమైన ,ఈ ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని , ప్రస్తుత ఈ ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యే ని ,ప్రభుత్వ అధికారులను పట్టణంలో నివసిస్తున్న కార్మిక ,కర్షక ,మెజార్టీ ప్రజలు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, విద్యావేత్తలు ,మేధావులు,మహిళలు ,విద్యార్థులు ,పలు కుల సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Oplus_131072
Oplus_131072
మోకెనపల్లి భద్రయ్య మందమర్రి మండలం రిపోర్టర్