గజ్వేల్ మండల పరిధిలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్. బంగ్లా వెంకటాపూర్ మాజీ సర్పంచ్ పాశం బాపురెడ్డి జయంతి వేడుకలలో పాల్గొని, అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన విద్యావేత్త అని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి, చట్టసభల్లో బహుజనులకు స్థానాలు కల్పించడానికి అంబేద్కర్ గారు న్యాయపరమైన పోరాటాలు ఎన్నో చేశారని జయంతి సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ నేటి యువత శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నవీన్, గిరి ,రాజు, బాలరాజు, నవీన్ ,నరేందర్, జి. శ్రీకాంత్, లక్ష్మణ్ ,శ్రవణ్ ,శేఖర్, ప్రశాంత్, వంశీ, మల్లేష్, షాదుల గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు పంజాల రవీందర్ గౌడ్ వెంకటేష్ లడ్డు బురాన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
