మట్టి గణపతి శ్రేష్టం సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
సెప్టెంబర్ 18
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ మట్టి గణపతి శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ మట్టి గణపతిని పూజిద్దామని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిలో వేయడం వల్ల అందులో జీవించే జలచరాలకు హాని కలుగుతుందని, విఘ్నాలను తొలగించే వినాయకుడిని మట్టితో పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు





