Breaking News

మానకొండూర్ చెరువు కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే

299 Views

(మానకొండూర్ డిసెంబర్ 30)

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలోని చేరువును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం సాయంత్రం సంభందిత అధికారులతో కలిసి పరిశీలించారు.

గతంలో చెరువు సుందరీకరణ పనుల్లో జరిగిన అవినీతి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చట్టాపరంగా చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టనని, చెరువు కట్ట పై దారి నిర్మించడంలో జరుగుతున్న ఆలస్యంపై సంభందిత అధికారులను ప్రశ్నించారు.

సుందరీకరణ పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని అన్నారు.
కట్టపై పెరిగిన చెట్లను పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశించారు.

గతంలో అవినీతికి పాల్పడి నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్,డి.ఈ మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *