గరీబోళ్ల పేద ప్రజా వకీల్ దేవునూరి రవీందర్
ఆయన సాధారణ వకీల్. పేరు దేవునూరి రవీందర్. ఊరు మందపల్లి పుట్టిన గడ్డ మహత్యమో… తెలంగాణ బతుకులు బాగుపడాలని ఆయన సీఎం కేసీఆర్ తో సహా కలలు కన్నారు. తెలంగాణ ఆవిర్భావమైన జగదృశ్యం కార్యాలయ కార్యదర్శిగా ప్రస్థానం ప్రారంభించి నేడు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు పిఏగా దేవునూరి రవీందర్ ప్రస్థానం కొనసాగుతోంది. ఉద్యమ సమయంలో నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారుల కేసులను ఉచితంగా న్యాయస్థానంలో వాదించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సమయంలో టిఆర్ఎస్ కార్యాలయ ముఖ్య బాధ్యులుగా వ్యవహరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దేవనూరి రవీందర్ పలు ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేసి న్యాయ విద్యను అభ్యసించారు కేసీఆర్ మరియు హరీష్ రావు గార్లను అనుసరించి సాగరే తప్ప ఎప్పుడు పార్టీలో గాని ప్రభుత్వంలో గాని పదవులను ఆశించలేదు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా సాగుతున్నారు. దేవునూరి రవీందర్ అనటం కంటే ఆయనను పేద ప్రజా వకీల్ సాబ్ అంటే సరిగ్గా సరిపోతుంది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో న్యాయవాదిగా. బీసీ అడ్వకేట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు
