Breaking News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పై కపట ప్రేమ చూపుతున్నాయి

233 Views
  1. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమ విడనాడాలని మండల కాంగ్రెస్ పార్టీ దొమ్మాటి నర్సయ్య స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నా చేయడం రాస్తారోకో చేయడం సిగ్గుచేటు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని అంటున్నదని అందుకే రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని అనడం అన్యాయం అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య రైతులు నలిగి పోతున్నారని మళ్లీ వరిపంట వేయ్యాల వద్ద అని అనుమానాల మధ్య కొట్టుమిట్టాడుతుండడం జరుగుతుందన్నారు. అటు బిజెపి ఇటు టిఆర్ఎస్ రైతుల పట్ల ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మరి శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్,వంగ గిరిధర్ రెడ్డి నాయకులు గండికోట రవి, గంట దండు శ్రీనివాస్,గంట బుచ గౌడ్,సంతోష్ గౌడ్, రామ్ రెడ్డి సుడిది రాజేందర్ ,గుర్రపు రాములు, లచి రెడ్డి మొగుళ్ళ మధు ,రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
Telugu News 24/7