ముస్తాబాద్, ఏప్రిల్ 11 (24/7న్యూస్ ప్రతినిధి) భారతీయ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పోతుగల్ గ్రామంలో గురువారం నిర్వహించారు. నాయకులు పెద్దిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోతుగల్ బస్టాండ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన్నీరు గౌతమ్ రావు, కోల కృష్ణగౌడ్, వరి వెంకటేష్ తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కులవ్యవస్తకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి తనభార్య సావిత్రీబాయి పూలేతో ఎన్నో పాఠశాలలు ఏర్పాటుచేసి విద్యాభ్యాసంచేసి ఉన్నత శిఖరాలను అదిరోదించిన మహనీయులు పూలే దంపతులు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏప్రిల్ మాసంలో జ్యోతిరావు పూలే 48గంటల వ్యవధిలోనే బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభమాసం మహోన్నతమైన వ్యక్తులు జన్మించడం ఈ మాసం ఎంతో శుభదాయకమని అన్నారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు ఇదేనెలలో రంజాన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
తెలిపారు. జ్యోతిరావు పూలే ఆరోజులలో ఆవిద్య అంటరానితనం అస్పృశ్యత అజ్ఞానము స్త్రీలపై వివక్ష వీటన్నిటి నిర్మూలించడానికి కంకణం కట్టుకొని కొట్లాడిన జ్యోతిరావు పూలే ఆ మహనీయుడి తండ్రి గోవిందరాజు తల్లి మున్నాభాయ్ వారి చిన్నతనం నుండి గొప్ప ఆశయాలతో సర్వసమాజం స్మృతిలో ఉంచుకొని పేదలకు విజ్ఞానం తో పాటు వెలుగులు నింపిన ఆ మహానీయుడి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గీసశంకర్, చీకోటి మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
