కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మంచిర్యాల జిల్లా అభివృద్ధి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
ఇటివల జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు సీతక్క మరియు శ్రీధర్ బాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై మరియు బీజేపీ పార్టీ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవ్వడంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ పార్టీ పై కాంగ్రెస్ నాయకులు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో పెద్దపల్లి పార్లమెంట్ లో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా 6300 కోట్ల రూపాయలతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించి రాష్ట్ర రైతులకు సబ్సిడీ పై రైతులకు యూరియా మరియు DAP సబ్సిడీ పై అందిస్తున్నారని అదే విధంగా స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. కానీ ఇదే వివేక్ వెంకట్ స్వామి బీజేపీ లో ఉన్నప్పుడు ఈ ఎరువుల కర్మాగారం పై ఏ ఒక్క నాడు కూడా ఏ ఒక్క కేంద్ర మంత్రిని కలవలేదని కానీ ఇప్పుడు ఎరువుల కర్మాగారం నేను తెరిపించానని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ చెన్నూర్ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కలిపిస్తా అని మాట ఇచ్చారని మరి ఇప్పటి వరకు ఎంత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. పెద్దపల్లి పార్లమెంట్ లో మరొక దళిత కుటుంబమే లేనట్టు కాంగ్రెస్ పార్టీ ఓకే కుటుంబానికి టిక్కెట్లు ఇచ్చి దళిత సమాజాన్ని అవమానించారని అన్నారు. జిల్లాలో కుటుంబ పాలన చేస్తున్న వివేక్ కుటుంబానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రంలో ఒక్క కుటుంబ పాలన అంతం అయింది అంటే మంచిర్యాల జిల్లాలో ఇంకొక కుటుంబ పాలన మొదలు అయిందని అన్నారు. మోదీ పై సీతక్క చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అని ఒక్క గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మోదీ అని ఒక్క గిరిజన మహిళా అయ్యి ఉండి ముర్ము వ్యతిరేకంగా ఓటు వేసిన ఘనత సీతక్క అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 నుండి రైతులకు 2 లక్షల రూపాయలు రుణ మాఫీ, 15 వేల రూపాయల రైతు భరోసా, మహిళలకు 2500 రూపాయలు, యువతకు నిరుద్యోగ భృతి, వృద్దులకు 4000 రూపాయల పెన్షన్ మరియు అనేక హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా దొంగ చాటున అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనిస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేంద్రంలో మరొకసారి వచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా బీజేపీ అభ్యర్థి గెలుస్తే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రజనీష్ జైన్, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, తుల ఆంజనేయులు, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, అందుగుల శ్రీనివాస్, అమీరిశెట్టి రాజు, బొలిషెట్టి అశ్విన్, బోయినీ హారి కృష్ణ, పల్లి రాకేష్, రెడ్డిమల్ల అశోక్, రాకేష్ రెన్వ, బింగి సత్యనారయణ మరియు తదితరులు పాల్గొన్నారు.
