సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఇటీవల నియామకం అయిన ఆర్యవైశ్య నాయకులు కొమురవెల్లి సంపత్ గుప్తాకు లయన్స్ క్లబ్ స్నేహా ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్ గా పదవీ చేపట్టిన సంపత్ కు అభినందనలు తెలిపి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు అలాగే ప్రతిరోజు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమానికి లాభాపేక్ష లేకుండా అల్పాహారం అన్నం , సంస్థ ద్వారా అందజేస్తున్న వాసవి సేవా సమితి నాయకులు సామ శ్రీధర్ పుట్టిన రోజు సందర్భంగా అల్పాహారం తో పాటు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు సయ్యద్ మతిన్, లయన్ నేతి శ్రీనివాస్, ఎల్లం రాజు, దొంతుల సత్యనారాయణ,శేఖర్, కాసం రాము,నాగేష్,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు




