ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు14, ముస్తాబాద్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి గుమ్మానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన జాతీయ పథకాన్ని ఎగరవేయాలని ఎంతో ఆసక్తితో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయం వీటిలో కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక.1947 ఆగస్టు15న బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందటానికి కొద్ది రోజుల ముందు,1947 జులై 22న జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఉన్న రూపంలో స్వీకరించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోని ప్రతి గుమ్మానికి త్రివర్ణ జెండా రెపరెపలాడాలని బంగారు తెలంగాణ దిశగా సాగిపోగా గ్రామపంచాయతీ ద్వారా జెండాను అందించి అమర్చడానికి కర్ర మరిచారు. గత సంవత్సరంలో కర్రతోపాటు త్రివర్ణ పతాకాన్ని అందించి ఈసంవత్సరం కర్ర ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. జాతీయ పతాకానికి ఇంకొన్ని గంటలే.. జెండా ఎగురవేయడానికి సమయం ఆసన్నమైన నిర్లక్ష్యపు నీడలో గ్రామపంచాయతీ తీరు ఎన్ని ఇండ్లపైన ఎగరవేస్తారనేది చూడాల్సిందేనంటున్న పలువురు గ్రామస్తులు పలు విధాల అనుకుంటున్నారు.




