రోడ్డు నిర్మాణం లో జాప్యం ప్రజలకు శాపం
నత్త నడకన బిటి రోడ్డు విస్తరణ పనులతో ప్రజలకు ఇబ్బందులు
విస్తరణ పనులు పై స్పందించనీ అధికారులు ప్రజాప్రతినిధులు
ఆసిఫాబాద్ జిల్లా మార్చి 31
ఖమన రహదారి విస్తరణ పనులు వారం రోజులపాటు చేస్తే మరో వారం రోజులపాటు ఆపేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై దుమ్ము ధూళి కంకర తేలడం తో కంకర రాళ్లుగత తొమ్మిది నెలల క్రితం ఇక్కడ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అయితే ఇప్పటికీ సవ్యంగా పూర్తి చేయట్లేదు. ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. దీనివల్ల వ్యాపారస్థులమంతా తీవ్రంగా నష్టపోయాం.
ఇప్పటికైనా.. త్వరగా ఈ రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. రోడ్లు ఎందుకు తవ్వేస్తున్నారో తెలియట్లేదు.. ఎందుకు నిర్మిస్తున్నారో అర్థం కావట్లేదు.. అసలు దీనికి ఒక ప్లానింగ్ అయినా ఉందో.. లేదో తెలియట్లేదు. మిగతా రోడ్ల విస్తరణ పనులు చాలా స్పీడ్‌గా అయ్యాయి. మరి ఖమన మాత్రం ఎందుకు ఇలా రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయో తెలియట్లేదు. కారణం ఏదైనా గానీ.. ఈ రహదారి విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టి.. వేగంగా పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుకుంటున్నాము.
