ఘనపూర్, మార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం.
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు జనగామ ఎమ్మెల్యే, స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి డాక్టర్ పల్లా రాజేశ్వరి రెడ్డి ఆదేశానుసరం..
రఘునాథపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు రఘునాథపల్లి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ కి కార్యకర్తలే బలం, బలగం
కెసిఆర్ తోనే మన ప్రయాణం
రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలను,నేతలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
అన్నివేళాల అండగా ఉంటా..
ఎవరూ ఆధైర్యపడవద్దు..
ఎవరికి ఆధికారం శాశ్వతం కాదు, ఎవరైని అక్రమకేసులు పెట్టిన,వేదించిన పార్టీలోనే ఉందాం.. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం
ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజల తరపున ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పై కొట్లాడుదాం
• పదేండ్లలో తెలంగాణలో ఏ ఒక్కరోజు రైతన్నల ఆత్మహత్యలు జరిగిన సంఘటనలు లేవు..మూడు నెలల్లోనే రైతన్నల ఆత్మహత్యలు.. ఆటో డ్రైవర్స్ ఆత్మహత్యలు ..నీళ్లు లేక పంటపోలాలు ఎండిపోతున్నాయి
పదేండ్లు అధికారాన్ని అనుభవించి..ఎమ్మెల్యేలుగా ఉండి ఇప్పుడు అధికార కాంక్షకోసం..పదవుల కోసం పార్టీలు మారుతున్నారు..
ఏడాదిలోనే కాంగ్రెస్ లోనే సంక్షోభం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు
ప్రజల సమస్యలను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతలపై,కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేదించడమే పనిగా పెట్టుకున్నారు
పదేండ్లలో మేము ప్రజలకోసం తప్పా ప్రతిపక్ష పార్టీల నేతలను కానీ కార్యకర్తలను కానీ వేధించిన సంఘటనలు లేవు
పదేండ్లలో ప్రతి ఇంటికి తాగునీళ్లు ..ప్రతి ఎకరాకు సాగునీళ్లు.కళ్యాణ లక్ష్మీ ..రైతుబంధు కింద ఎకరాకు పదివేలు ఇచ్చాము..ఆసుపత్రులు..జిల్లా కలెక్టర్ కార్యాలయాలను..మెడికల్ కాలేజీలను నిర్మించాము
పదేండ్లలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దితే కాంగ్రెస్ మాత్రం మూడు నెలల్లోనే దిగజార్చింది..
పార్టీని వీడిన వారితో మనకు నష్టం ఏమీలేదు..
రఘునాథపల్లి మండల బీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడకండి..జెండా మోసే ప్రతి కార్యకర్తలు నేను అండగా ఉంటాను.
పదేండ్లు అధికారంలో ఉన్నాము..ఏడాది లేకపోతే ఏమి కాదు
మీకు ఏ కష్టమోచ్చిన నేను అందుబాటులో ఉంటాను,అన్ని విధాలుగా తోడుంటాను,
మీతో ఉంటాను,మీమధ్యలో ఉంటాను, ధైర్యంగా ఉండండి..
తెలంగాణ తెచ్చిన నాయకులు కేసీఆర్ వెంట ఉంటా..పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు..బి.ఆర్ ఎస్ పార్టీని వీడిన వారే పచ్చాత్తాప పడే రోజులు దగ్గరే ఉన్నాయి..
ఈ కార్యక్రమంలో జనగాం జిల్లా మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోకల శివకుమార్, తెలంగాణ ఉద్యమ కారులు నామాల బుచ్చన్న, మాజీ ఏ ఎం సి వైస్ చైర్మన్ మూసిపట్ల విజయ్, జనగాం జిల్లా రైతు సమన్వయ సభ్యురాలు దొనికల రమాదేవి, ఏఎంసి డైరెక్టర్ శివరాత్రి రాజు, బొంగు ఐలయ్య, ఎంపీటీసీ శాఖ నాగరాజు, శాగ సురేష్, బాలు, గన్నోజు మధు ,పండుగ ప్రేమ్, కుమార్,దామేర వెంకన్న, కొండ అశోక్, మేడే అశోక్ ,సాగ నాగేష్, నాగయ్య సాగ, కందుకూరి రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచులు యూత్ నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.