ఆదివారం రోజుతో25 రోజులకు నిరవధిక సమ్మె చేరుకుంది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కొండపాక మండలం సమ్మె శిబిరాన్ని సందర్శించి అమ్ముల బాల్ నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటి సభ్యులు,మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.వెంటనే రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఈఎస్ఐ, పిఎఫ్,ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2023 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి సమాన వేతనాలు ఇవ్వాలని అన్నారు.తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈనెల 31 సోమవారం రోజున కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో గ్రామపంచాయతీ కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ప్రభుత్వ స్పందించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కార్మికులు ఆరుట్ల నర్సింలు,జాలిగామ ప్రభాకర్,పల్లె శ్రీనివాస్,నరహరి, నేరటి కలవ్వ,కిష్టయ్య,పంజా శ్రీనివాస్,కొమ్ము నర్సింలు,పుష్ప,రాజవ్వ,రాజు, లక్ష్మి,నరసవ్వ,మల్లవ్వ, ఎల్లయ్య,గండయ్య,ఎల్లయ్య, ఆమ్మూర్తి,మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
