Breaking News

ఛాన్స్ ఇస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తా

144 Views

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం

ఎల్లారెడ్డిపేట మార్చి 30 ;

ఛాన్స్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తానని మాజీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం తెలిపారు,
తనకు అవకాశం కల్పించాలని హైదరాబాదులో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన నివాసంలో కలిసి మృత్యుంజయం విజ్ఞప్తి చేశారు ,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాలువా కప్పి సన్మానించినట్లు ఆయన వెల్లడించారు,
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని లేకుంటే ప్రవీణ్ రెడ్డి కి ఇవ్వాలని రేవంత్ రెడ్డితో మృత్యుంజయం చర్చించినట్లు తెలుస్తోంది ,
కరీంనగర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం.
కరీంనగర్ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీలో ఉత్కంట కొనసాగుతోంది. అభ్యర్థి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారుయ్యారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది.
ఇప్పుడు ‌అందరి‌ దృష్టి కరీంనగర్ ‌పార్లమెంట్ నియోజకవర్గంపై‌నే ఉంది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో ఈ ప్రాంతమే కీలకపాత్ర పోషించింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి ‌సారించాయి. బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ‌పార్టీ నుంచి వినోద్‌ కుమార్ బరిలోకి‌ దిగుతున్నారు. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు , కాంగ్రెస్ పార్టీ నుండి ‌హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ‌ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు టికెట్ కోసం‌ తీవ్రంగా ‌ప్రయత్నాలు చేస్తున్నారట. తాజాగా తీన్మార్ మల్లన్న పేరు కూడా తెర పైకి వచ్చింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7