దౌల్తాబాద్ మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ గడ్డమీద భాగ్య ఎల్లం, ఎంపిటిసిలఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డమీది భాగ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు బిడ్డగా రైతుల పక్షపాతిగా రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వరి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తుందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రతి వరి ధాన్యంను తెలంగాణ ప్రభుత్వమే ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన తర్వాత రైతు ఖాతాలోని కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు జమ అయితాయని తెలిపారు. రైతులు ఐకెపి సెంటర్ సిబ్బందికి సహకరించాల్సిందిగా ఆయన సూచించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాలేశ్వరం, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందని తెలిపారు . పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షులు బండారు దేవేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పడాల నాగేష్, ఏపీఎం కిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరుడు సత్తయ్య, నాయకులు వెంకటయ్య, నర్సింలు, రాజనర్స్, యాదయ్య, కిష్టయ్య, నాగరాజు, ఎల్లం, లక్ష్మయ్య, సీఏ నర్సింలు, వివో లీడర్ లక్ష్మి, శాతాల లక్ష్మి, గ్రామ రైతులు హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
