Breaking News

ఎమ్మెల్సీ పోచంపల్లి మానవతా వితరణ*

184 Views

*ఎమ్మెల్సీ పోచంపల్లి మానవతా వితరణ*

చేర్యాల:

మరణించిన పేద కుటుంబాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అండగా ఉంటూ తన స్వతగా ఆర్థిక సాయం అందించడం హర్షనీయమని మున్సిపల్ ప్లోర్ లీడర్ మంగోలు చంటి అన్నారు. ఓ నీరుపేద కుటుంబానికి చెందిన మృతరాలి కుటుంబానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని తూర్పు గుంటూరుపల్లికి చెందిన పల్లా తులసమ్మ(60) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. మృతిచెందగా ఆర్థిక స్తోమత లేక దహన సంస్కారాలు చేయలేని దీనాదయ స్థితిలో ఉండగా స్థానిక మున్సిపల్ ప్లోర్ లీడర్ మంగోలు చంటి.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తీసుకెళ్ళగా ఆయన చల్లించిపోయారు… వెంటనే ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా 10 వేలు మంగోలు చంటి చేతుల మీదుగా అందజేసి కుటుంబానికి అండగా నిలిచారు.. అనంతరం మృతరాలి భౌతికకాయనికి చంటి పూలమాలవేసి నివాళులర్పించి  కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు . పేద కుటుంబంలో మరణించిన  అంతక్రియల ఖర్చులకు ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పట్టణ ప్రజలు, కృతజ్ఞతలు తెలిపారు .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *