సడక్ బందును జయప్రదం చేయండి… మండల జేఏసీ కో కన్వీనర్ కొంగరి వెంకటమావో..
చుంచనకోట సెప్టెంబర్ 25:
సిద్దిపేట జిల్లా చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని చేర్యాల జేఏసీ ఉద్యమంలో భాగంగా ఈనెల 29 శుక్రవారం రోజున రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నిర్ణయం మేరకు సిద్దిపేట జనగామ జాతీయ రహదారిపై జరిగే సడక్ బందును జయప్రదం చేయాలని చుంచనకోట గ్రామస్తులందరూ ముస్త్యాల గ్రామంలో జరిగే సడక్ బందుకు హాజరై జయప్రదం చేయాలని రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ మండల కో కన్వీనర్ కొంగరి వెంకట్ మావో పిలుపునిచ్చారు. సోమవారం రోజున ముస్త్యాల గ్రామ ప్రధాన రహదారిపై జరిగే సడక్ బంద్ జయప్రదానికై చుంచనకోట గ్రామస్తులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ చేర్యాల ప్రాంతాన్ని నేటి పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రము ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట తప్పి ఇక్కడి ప్రజలను ఇంతకాలం మభ్యపెడుతూ మోసపుచ్చారని అని ఆటలు ఇక చెల్లవని డివిజన్ ప్రకటించేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుంచనకోట గ్రామ ప్రజాప్రతినిధులు, మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, రైతులు, కార్మికులు, వృత్తిదారులు వివిధ వర్గాల ప్రజలంతా ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
