ప్రభుత్వానికి ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు……
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
ప్రభుత్వానికి. ప్రజలకు మూల స్తంభాలు పత్రికలు అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సాయిబాబా గుడి సమీపంలో ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు , అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో జిల్లా ఎస్పీ రాహూల్ హేగ్డే మాట్లాడుతూ పోలీసులు పత్రికలు కలిసి పనిచేస్తే సమాజాన్ని మంచి మార్గంలో తీసుక వెళ్ళవచ్చు అన్నారు, సమాజాన్ని తీర్చి దిద్దవచ్చాన్నారు , ఇన్వెస్టిగేషన్ , చాలా కేసులు మీడియా ద్వారానే పరిష్కారమయ్యాయని అన్నారు, పత్రికలు ఎలక్ట్రానిక్స్ మీడియా సహకారం ఎల్లప్పుడూ పోలీస్ శాఖకు ఉండాలన్నారు,
అనంతరం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , జెడ్ పిటీసీ చీటీ లక్ష్మన్ రావు , ఎంపిపి పిల్లి రేణుక కిషన్ , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డెబోయిన గోపి, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు , భహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ , కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జర్నలిస్టుల సమస్యలను ప్రస్తుతం పరిపాలిస్తున్న , ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు, గ్యాస్ డీలర్ గట్టు రాజయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెలుగు లోకీ తెచ్చేది పరిష్కరించేదీ పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు , ప్రెస్ క్లబ్బు బిల్డింగ్ నిర్మాణం కోసం తన వంతుగా 50వేల రూపాయల ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు, ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి రెండు గుంటల ఖాళీ. స్థలంతో పాటు.
భవనానికి. నిధులు ఇప్పించాలని తోట ఆగయ్య కు విజ్ఞప్తి చేశారు , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మజీద్ మాట్లాడుతూ జిల్లాలోని మండలాల అన్ని మండలాల జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ,పని చేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని , ప్రతి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించి నిధులు ఇప్పించాలని డిమాండ్ చేశారు , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ను ఆయన , కోరారు
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీకి అధికారులకు ప్రజాప్రతినిధులకు వివిధ పార్టీల నాయకులకు వివిధ ప్రెస్ క్లబ్ ప్రతినిధులకు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ జ్ఞాపికలను అందజేశారు, ఈ సమావేశంలో ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ గౌడ్ , జిల్లా పరిషత్ పోర నెంబర్ చాంద్ పాషా ఎంపీడీవో చిరంజీవి తహసిల్దార్ జయంతు వ్యవసాయ అధికారి భూమి రెడ్డి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, మండల కోషన్ నెంబర్ జబ్బర్ , ఎంపిటీసి సభ్యురాలు పందిర్ల పర్షరాములు , ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ గ్రామపంచాయతీ ఇవో ప్రవీణ్ ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారు బండారు బాల్రెడ్డి , ప్రధాన కార్యదర్శి షరీఫ్ , ఉపాధ్యక్షులు చేపూరి నాగరాజు కూలేరి కిషోర్ , సహాయ కార్యదర్శి కందుకూరి రవి , కోశాధికారి రామోజీ శేఖర్ ,కార్యవర్గ సభ్యులు ఉరిమడ్ల నరేష్ ,రామోజీ ప్రవీణ్ ,దుర్గం విజయబాబు , రామోజీ దేవరాజు వివిధ మండలాల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు , వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు,
