71 Views
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాఖీ కట్టిన అక్క, చెల్లెలు
– నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి (చారకొండ వెంకటేష్) :
అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రాతికగా రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ తన నివాసంలో అక్క చెల్లెలు రాఖీ కట్టి స్వీటు తినిపిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల మాట్లాడుతూ…… తల్లిదండ్రుల తర్వాత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న అన్నా చెల్లెలు ,అక్క తమ్ముడు మధ్య సంబంధం ఉంటుందన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువుల బాధ్యతలు అన్నని వ్యవహరించే సంప్రదాయం ప్రతీకగా కొనసాగుతుందని అందుకు ప్రాతికగా ఈ అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు రాఖీ పండుగ అని గుర్తు చేశారు. ఈ రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరం ఒక దగ్గరికి కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా కుల మతాలు అనే తేడా లేకుండా ముస్లిం మహిళ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాఖీ కట్టి ఆశీర్వదించారు.