తెలంగాణ, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్యలు పరిష్కరించాలి.
తెలంగాణ రైతాంగ సమితి సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్.
తెలంగాణ రాష్ట్రంలో భూమి సమస్యలు ఎంతో సంక్లిష్టంగా తయారయ్యాయి రెవిన్యూ పరమైన సమస్యలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ హర గోపాల్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ముందరయ్యే విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతుల వ్యవసాయరంగ సమస్యల పైన జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వ కాలంలో మొత్తం రైతులను వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించకుండా మరింత సంక్షోభంలోకి నెట్టింది. దున్నేవారికి భూమి దక్కాలంటే రైతులు ఉద్యమించి సాధించుకోవాలని కొత్త ప్రభుత్వం వేసే రైతు కమిషన్ ముందు లేవనెత్తాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో లక్షలాది సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించాలని కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా రైతు బీమా పంట రుణాలు అందించాలని గత వర్షాకాలంలో నష్టపోయిన మెట్ట పంటలకు పరిహారం ఇవ్వాలని కనీస మద్దతు ధరలకు చట్టం చేసి అమలు చేయాలని అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. సదస్సులో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి, తెలంగాణ రైతు సంఘం నాయకులు టీ సాగర్, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి జి గోపాల్, ఇంద్రసేన, రాజేందర్, ఉమ్మడి మహబూబ్నగర్, నిజాంబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, జిల్లాలకు చెందిన సత్య రెడ్డి, వెంకటయ్య, బాల్రెడ్డి, సైదులు,రాజు, అప్పారెడ్డి, లచ్చ న్న, మాధవ రెడ్డి, వరంగల్ జిల్లా మహిళా రైతులు వివిధ మండలాల రైతాంగ సమితి నాయకులు పాల్గొన్నారు.