– మీరు టిడిపిని విలీనం చేసుకున్నప్పుడు చెప్పులు గుర్తుకు రాలేదా?
– పార్టీ ఫిరాయింపులకు ఆధ్యులు మీరు కాదా?
– పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో
– కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని ప్రజలే చెప్పుతో కొడతారని నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి హెచ్చరించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డిపేటలో మీడియాతో మాట్లాడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిన్న హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని ప్రజలే చెప్పుతో కొడతారని నీతులు చెబుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీ ఫిరాయింపులకు ఆధ్యం పోసింది బీఆర్ఎస్ నాయకులు కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మభ్యపెట్టి నాయకులను చేర్చుకున్నప్పుడు మీ నీతి ఎటు పోయిందని మండిపడ్డారు. పల్లా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు పక్కనపెట్టిన సంగతి గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను, ఆరు గ్యారెంటీలను చూసి నాయకులు పార్టీలో చేరుతున్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుకుంటుందని అన్నారు. 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
