రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె హత్య పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
